మార్స్‌‌పై జర్నీ షురూ

మార్స్‌‌పై జర్నీ షురూ
  • సక్సెస్ఫుల్గా పర్సివరెన్స్ టెస్ట్డ్రైవ్
  • ఆరున్నర మీటర్లు ముందుకు వెళ్లిన రోవర్
  • 33 నిమిషాల పాటు సాగిన టెస్ట్ డ్రైవ్

లాస్ఏంజిలిస్నాసా మార్స్ రోవర్ పర్సివరెన్స్ తన జర్నీ మొదలుపెట్టేసింది. అంగారకుడిపై పరిశోధనలకు ముందు రోవర్ టెస్ట్ డ్రైవ్ కు వెళ్లింది. సక్సెస్ ఫుల్ గా ఆరున్నర మీటర్లు ముందుకు కదిలింది. 33 నిమిషాల పాటు సాగిన టెస్ట్ డ్రైవ్ లో 4 మీటర్లు ముందుకు వెళ్లిన రోవర్.. తర్వాత ఎడమవైపు 150 డిగ్రీలు తిరిగి మరో రెండున్నర మీటర్లు ప్రయాణించింది. టెస్ట్ డ్రైవ్ సందర్భంగా రోవర్ చక్రాల అచ్చులు స్పష్టంగా కనిపించాయి. రోవర్లోని ప్రతి వ్యవస్థను చెక్ చేసేందుకుగానూ ఈ టెస్ట్ డ్రైవ్ ను నిర్వహించినట్టు నాసా ప్రకటించింది. రోవర్ను మార్స్ పైన దింపినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ అని నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీకి చెందిన ఇంజనీర్ అనాయిస్ జరీఫియన్ చెప్పారు. టెస్ట్ డ్రైవ్ లో రోవర్ అన్ని విషయాల్లోనూ సక్సెస్ అయిందన్నారు. రాబోయే రెండేళ్ల పాటు రోవర్  నిరాటంకంగా పనిచేస్తుందని ఈ డ్రైవ్ తో తేలిందన్నారు.

రోజూ 200 మీటర్లు

రోవర్ ఆపరేషన్లు ప్రారంభించాక రోజూ 200 మీటర్ల పాటు ప్రయాణిస్తుందని నాసా చెబుతోంది. పరిశోధనల్లో భాగంగా గతంలో అక్కడ జీవరాశి మూలాలను రోవర్ తెలుసుకుంటుందని పేర్కొంది. అంగారకుడిపై గత వాతావరణంతో పాటు గ్రహానికి సంబంధించిన నేల వివరాలను సేకరిస్తుందని తెలిపింది. ఇక, దిగిన కొద్ది రోజులకే మార్స్ ఫొటోలను పర్సివరెన్స్ పంపించినట్టు వెల్లడించింది. రోవర్ తీసిన ఫొటోలను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ట్రేస్ గ్యాస్ ఆర్బిటర్, నాసా మావెన్ ద్వారా ఆ ఫొటోలను భూమికి పంపించిందని తెలిపింది.